14 ఏళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడి అత్యాచారయత్నం

14 ఏళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడి అత్యాచారయత్నం

చిత్తూరు పట్టణంలో మరో దారుణం జరిగింది. షర్మన్ బాలికోన్నత పాఠశాలలో చదివే 14 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఆమెపై 17 ఏళ్ల బాలుడు దారుణానికి ప్రయత్నించాడు. ఈ నెల 16న మద్యాహ్నం ఒంటిగంటకు స్కూల్‌ వదిలినా.. బాలిక ఇంటికి చేరలేదు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు స్కూల్‌ వద్దకు వెళ్లి వెతికారు. ఈ క్రమంలో స్కూల్ ఆవరణలోని జూబ్లీ హాల్ పక్కనే.. బాలికపై బాలుడు అత్యాచారయత్నం చేస్తుండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. వారు కేకలు వేయడంతో.. బాలుగు గోడదూకి పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు చిత్తూరు వన్ టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఎస్పీ ఆదేశాలతో దిశ పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story