AYESHA MEERA CASE: అయేషా మీరా కేసులో సంచలనం

2007లో విజయవాడలో జరిగిన బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని సీబీఐ కోర్టు అయేషా తల్లిదండ్రులు బాషా, సంషేద బేగంకు నోటీసులు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించడంతో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సత్యంబాబుపై నమోదు చేయాలనుకుంటున్న రెండు సెక్షన్లు అత్యాచారం, హత్య నేరాలకు చెందినవే. అంటే సీబీఐ దర్యాప్తులోనూ అన్ని ఆధారాలు.. సత్యంబాబు నేరం చేసినట్లుగా నిరూపించేలా బయటడ్డాయన్న అభిప్రాయం న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) ప్రకారం... సెక్షన్ 302 (హత్య) కేసు. హత్య చేసినవారికి మరణశిక్ష (డెత్ పెనాల్టీ) లేదా జీవిత కాలం ఖైదు (లైఫ్ ఇంప్రిజన్మెంట్), అలాగే జరిమానా విధించవచ్చు. ఇది అతి తీవ్రమైన నేరం, కోర్టు ఆధారాల ఆధారంగా శిక్ష నిర్ణయిస్తుంది. సీబీఐ ఈ కేసులో మరోసారి దర్యాప్తు చేపట్టింది. అలాగే ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని కూడా మరోసారి బయటికి తీసి రీపోస్టు మార్టం నిర్వహించింది. అయినా వాస్తవాలు వెలుగు చూడలేదు. సత్యంబాబుపై అభియోగాలపై కావడం సంచలనం రేపుతోంది.
కోర్టు తాజాగా సత్యంబాబు పై సెక్షన్లు 376, 302 కింద అభియోగాలు (FIR) నమోదు చేయాలని సీబీఐ సూచించినట్టు, దానికి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోర్టు అడిగింది. తల్లిదండ్రులు సెప్టెంబర్ 19న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అప్పుడే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com