Bengaluru: తొమ్మిది నెలల చిన్నారి.. మృతదేహాల మధ్య అయిదు రోజులు

Bengaluru: తొమ్మిది నెలల చిన్నారి.. మృతదేహాల మధ్య అయిదు రోజులు
Bengaluru: ఎవరైనా కుటుంబసభ్యులకు చిన్న ఆపద కలిగినా తట్టుకోలేకపోతారు. మరి వారి మరణ వార్త తెలిస్తే ఆ బాధను వర్ణించలేం.

Bengaluru: ఎవరైనా కుటుంబసభ్యులకు చిన్న ఆపద కలిగినా తట్టుకోలేకపోతారు. అలాంటిది వారి మరణ వార్త తెలిస్తే వారు పడే బాధ గురించి మాటల్లో చెప్పలేం. కానీ ఊహ తెలియని ఒక చిన్నారి తన కుటుంబసభ్యుల మృతదేహాలతో అయిదు రోజులు గడిపింది. సరిగ్గా మాటలు కూడా రాని తను వేరేవాళ్లకి ఆ సంఘటన ఎలా చెప్పాలో తెలియక, ఇంటి నుండి బయటికి వెళ్లే దారి లేక ఆ మృతదేహాలతోనే ఉండిపోయింది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన బెంగళూరులోని బయదరహల్లి (Byadarahalli)లో చోటుచేసుకుంది.

ఆ ప్రాంతంలో నివాసముంటున్న శంకర్, భారతిలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. వారి పెద్ద కూతురు శించనకు రెండున్నరేళ్ల ప్రేక్షతో పాటు తొమ్మిది నెలల కొడుకు కూడా ఉన్నాడు. తన చిన్న కూతురు సింధూరిని కూడా భర్తతో గొడవపడి వచ్చి తల్లిదండ్రులతోనే కలిసుంటుంది. ఆరు రోజుల క్రితం కొడుకు మధుసాగర్, తండ్రి శంకర్‌కు గొడవ జరగగా తండ్రి కోపంతో ఇంట్లో నుండి వెళ్లిపోయాడని చుట్టుపక్కన ఇళ్ల వారు చెప్తున్నారు.

ఈ గొడవ వల్ల మనస్తాపానికి గురైన కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలిసుల అనుమానం.అయిదు రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన శంకర్ వారిని అలా చూసి షాక్‌లోకి వెళ్లిపోయారు. అన్ని మృతదేహాల మధ్య తొమ్మిది నెలల చిన్నారి మాత్రమే ఇంకా ప్రాణాలతో ఉంది. కానీ తాను కూడా అయిదు రోజులు అదే ఇంట్లో ఉండడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయిందని, అందుకే తనని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story