మరీ ఇంత దారుణమా.. అందుకోసమే నాలుగేళ్ల కొడుకును చంపేసింది

మరీ ఇంత దారుణమా.. అందుకోసమే నాలుగేళ్ల కొడుకును చంపేసింది
అందుకే బాలుడిని చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు

ఇటీవల తన నాలుగేళ్ల కొడుకును చంపి.. బాడీని సూట్ కేస్ లో తరలిస్తూ మైండ్‌ఫుల్ ఏఐ సీఈవో సుచనాసేత్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు కీలక అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. భర్తతో విడాకుల నేపథ్యంలో నాలుగేళ్ల కొడుకును తన భర్త వెంకతరత్నం తో గడిపేందుకు కోర్టు అనుమతి ఇవ్వడం ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. 2022లో, ఈ సూచనా-వెంకటరత్నం జంట విడాకుల ప్రక్రియ ప్రారంభమైంది. కొడుకును ఎవరి దగ్గర ఉంచాలనే దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఆదివారం భర్త వద్దే కొడుకు ఉండేందుకు కోర్టు అనుమతించింది. ఈ ఆదేశాలతో సుచన తీవ్రంగా నిరాశ చెందింది. అందుకే బాలుడిని చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం గోవా కోర్టు సుచనను ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.

హత్య కోసం పక్కా ప్లాన్:

పోలీసులకు హోటల్ గదిలో సోదా చేస్తున్నపుడు దగ్గు మందు సీసాలు, పెద్దది, చిన్నవి దొరికాయి. దీంతో పిల్లాడికి అధిక మొత్తంలో దగ్గు మందు ఇచ్చి.. గొంతు నులిమి హత్య చేసినట్టు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. తనకు దగ్గు వస్తోందని, సిరప్ బాటిల్ కావాలని హోటల్ సిబ్బందిని కోరింది సుచన. కానీ, ఈ విషయాన్ని సుచన ఒప్పుకోవడంలేదు. తాను ఈ హత్య చేయలేదని, నిద్ర లేచి చూసేసరికి కొడుకు చనిపోయాడని ఆమె చెప్పిందని పోలీసులు చెబుతున్నారు. శవపరీక్ష అనంతరం బాలుడి మృతదేహాన్ని తండ్రికి అప్పగించారు. కాగా సుచనసేథ్ నిర్వహిస్తున్న సంస్థకు సొంత కార్యాలయం లేదు. నాలుగు నెలల కిందటే బెంగళూరులోని తానిసంద్రలోని అపార్ట్‌మెంట్‌ను ఆమె ఖాళీ చేసిందని పోలీసులు గుర్తించారు.

బాలుడి తండ్రి వెంకటరత్నం బుధవారం ఉదయం ఇండోనేషియా నుంచి హిరియూరు వచ్చాడు. ఆయన అనుమతితో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య బృందం బాలుడికి శవపరీక్ష నిర్వహించింది. చిన్నారి గుండెలో మంట వచ్చి ఊపిరాడక మృతి చెందినట్లు డాక్టర్ కుమారనాయక్ తెలిపారు. బాలుడిని ఆదివారం హత్య చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. కొడుకు శవాన్ని చూసి తట్టుకోలేకపోయాడు ఆ తండ్రి. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని తండ్రి వెంకటరత్నంకు అప్పగించారు. ఆయన బెంగళూరులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.మరీ ఇంత దారుణమా.. అందుకోసమే నాలుగేళ్ల కొడుకును చంపేసింది

Tags

Read MoreRead Less
Next Story