Basara: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

IIIT Basara: బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాయ్స్ హాస్టల్-1లో పీయూసీ-2 చదువుతున్న స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు గదిలో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మంచాల్‌కు చెందిన భానుప్రసాద్‌గా గుర్తించారు.
విద్యార్థి సూసైడ్ నోట్ రాసి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. భానుప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. తమకు అనుమానాలు ఉన్నాయంటూ నిర్మల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com