ప్రియుడి మరణాన్ని జీర్జించుకోలేక ప్రియురాలు..

ప్రేమలో ఉంటే ప్రపంచాన్నే మరిచి పోతారు.. ప్రేమ కోసం పెద్దల్ని సైతం ఎదిరిస్తారు.. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందా అంటే అది వారి వ్యక్తిగత స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ప్రేమించిన ప్రియుడు దూరమయ్యాడు.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.. ఆమెకు బ్రతుకు మీద విరక్తి కలిగింది. తాను కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.
ఈ విషాద సంఘటప యానాంలో చోటు చేసుకుంది. ఇక్కడి యూకేవీ నగర్ కు చెందిన మీసాల మౌనిక కురసం పేటకు చెందిన నిమ్మకాయ చిన్నా రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గంజాయికి బానిసైన చిన్నా తన సోదరుడిని రూ.500 లు అడిగితే ఇవ్వలేదని క్షణికావేశంలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన ప్రియుడి మృతిని జీర్ణించుకోలని మౌనిక మౌనంగా రోదించింది. ప్రియుడికి సంబంధించిన వస్తువులను తన దగ్గరే ఉంచుకుని బాధపడేది. అతడు లేని జీవితం వద్దనుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com