Bengal : బాలికను కొట్టి, హింసించి, ఆపై..

Bengal : బాలికను కొట్టి, హింసించి, ఆపై..
విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి

ఒక మైనర్ బాలికపై టీచర్ పాఠశాల లోనే లైంగిక దాడికి దిగిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పశ్చిమ బెంగాల్ ల్లోని పరగణ జిల్లాలోని ఓ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. జూలై 21న ఢోలాఘాట్ హై మదర్సాకు చెందిన ఫైజుద్దీన్ మొల్లా అనే నిందితుడు బాధితురాలు వాష్రూమ్ కి వెళితుంటే వెంబడించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక సహాయం కోసం కేకలు వేయడంతో అతను ఆమెను కొట్టి వాష్‌రూమ్‌లో పెట్టి తలుపు వెయ్యటానికి ప్రయత్నించాడు.

అయితే అనుకోకుండా బాలిక స్నేహితులు అక్కడికి రావటంతో తనను రక్షించి, జరిగిన విషయాన్ని తల్లికి తెలియజేశారు. ఈ విషయం పై బాలిక తల్లి స్కూల్ సిబ్బందిని, మేనేజ్మెంట్ ను ప్రశ్నించగా వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.

బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం ఢోలాఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376, పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం సాయంత్రం నిందితుడిని అరెస్ట్ చేశారు.

Tags

Next Story