Manjusha Niyogi: మరో మోడల్ ఆత్మహత్య.. 15 రోజుల వ్యవధిలో ముగ్గురు..
Manjusha Niyogi: బెంగాలీ మోడల్ మంజుషా నియోగి కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. మూడు రోజుల్లో నగరంలో సెలబ్రిటీ ఆత్మహత్యలు జరగడం ఇది రెండోసారి.
బిదిషా డి మజుందార్ తర్వాత మరో బెంగాలీ మోడల్ ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ మోడల్ అయిన మంజూషా నియోగి కోల్‌కతాలోని తన నివాసంలో తన గది పైకప్పుకు ఉరి వేసుకుని కనిపించింది. కోల్‌కతాలోని పటులి ప్రాంతంలో మంజూష తన కుటుంబంతో కలిసి ఉంటోంది. మూడు రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని పోలీసులు తెలిపారు.
మంజుషా నియోగి మే 27న తన నివాసంలో ఉరివేసుకుని కనిపించింది. మోడల్ తల్లి తన సన్నిహితురాలు బిదిషా డి మజుందార్ మరణం తర్వాత ఆమె తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పేర్కొంది. మే 26న బిదిషా ఆత్మహత్య చేసుకుంది.
మంజూషా నియోగి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపించి మరణానికి గల కారణాలను నిర్ధారించనున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
"బిదిషాతో కలిసి ఉండాలని నా కూతురు ఎప్పుడూ చెబుతుండేది. నిన్న మరణించిన బిదిషా గురించే ఆలోచిస్తూ ఉంది. ఆమె గురించే మాట్లాడుతోంది. త్వరలో మీడియా బిదిషాలాగే మన ఇంటికి కూడా వస్తారని నా కూతురు అన్నప్పుడు నేను ఆమెను తిట్టాను" అని మంజూష తల్లి భోరున విలపిస్తోంది కూతురు శవాన్ని చూసి.
మంజూష కంటే ముందు, బెంగాలీ మోడల్ నుండి నటిగా మారిన బిదిషా డి మజుందార్ కోల్‌కతాలోని డమ్ డమ్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. 21 ఏళ్ల నటి గత నాలుగు నెలల నుంచి అక్కడే అద్దెకు ఉంటోంది.
మే 25, సాయంత్రం నాగర్‌బజార్ ప్రాంతంలోని ఆమె ఫ్లాట్ లో ఉరి వేసుకుని మరణించింది. పోలీసులకు సమాచారం అందడంతో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే బరాక్‌పూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
ప్రముఖ బెంగాలీ టెలివిజన్ నటి పల్లవి డే కూడా 15 రోజుల క్రితం గార్ఫా ప్రాంతంలో అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని కనిపించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com