Bengaluru: గార్డెన్ సిటీ రక్తసిక్తం.. విద్యార్ధిని పొడిచిచంపిన తోటి విద్యార్ధి

బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రెసిడెన్సీ కళాశాల ఆవరణంలో 19 ఏళ్ల యువతిని సహ విద్యార్ధే కత్తితో పొడిచేశాడు. ఈ ఘటన సోమవారం మద్యాహ్నం 1 గంటకు చోటు చేసుకుంది.
ప్రెసిడెన్సీ కాలేజ్‌లో చదువుతున్న లయస్మితను 23 ఎళ్ల పవన్ కళ్యాణ్ అనే బీటెక్ విద్యార్థి తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు ఒకరికి ఒకరు పరిచయస్తులేని తెలిసింది. కాగా లయస్మితను పొడిచిన వెంటనే పవన్‌కళ్యాణ్ తనను తాను పొడుచుకున్నాడు.
ఇద్దరినీ వేరు వేరు ఆసుపత్రులకు తరలించగా లయస్మిత మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. పవన్‌కళ్యాణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఘటనకు గల కారణాలు తెలియలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బెంగుళూరు రూరల్ ఎస్పీ మల్లిఖార్జున్ బాల్‌దండి మీడియాకు చెప్పారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com