Crime News: అమ్మ ఎందుకు అలా చేసింది.. నాలుగేళ్ల చిన్నారిని నాలుగో అంతస్తు నుంచి..

Crime News: అమ్మ ఎందుకు అలా చేసింది.. నాలుగేళ్ల చిన్నారిని నాలుగో అంతస్తు నుంచి..
X
Crime News: అన్నం తినకపోతే అది చూపించి, ఇది చూపించి నాలుగు ముద్దలు తినేలా చేసే అమ్మ నాలుగేళ్ల చిన్నారిని నాలుగో అంతస్తు నుంచి ఎందుకు పడేసింది.

Crime News: అన్నం తినకపోతే అది చూపించి, ఇది చూపించి నాలుగు ముద్దలు తినేలా చేసే అమ్మ నాలుగేళ్ల చిన్నారిని నాలుగో అంతస్తు నుంచి ఎందుకు పడేసింది. మతి ఉండే చేసిందా ఆ పని.. పాపం ఆ పసి బిడ్డ అంత ఎత్తు నుంచి పడి ఎంత నరక యాతన అనుభవించిందో. పడగానే తీవ్ర రక్త స్రావం అయి ప్రాణాలు కోల్పోయింది.

ఉత్తర బెంగళూరులోని ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గురువారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగో అంతస్తు అపార్ట్‌మెంట్ బాల్కనీ నుండి ఒక మహిళ తన నాలుగేళ్ల కుమార్తెను విసిరివేసిన దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

బాధ కలిగించే సిసిటివి ఫుటేజీలో, బెంగళూరులోని తమ నాలుగో అంతస్తు అపార్ట్‌మెంట్ బాల్కనీ నుండి ఒక మహిళ తన నాలుగేళ్ల కుమార్తెను విసిరివేయడం కనిపించింది. ఆమె బిడ్డను కిందకు విసిరేసిన తర్వాత, ఆమె కూడా రెయిలింగ్‌ పైకి ఎక్కి కొన్ని సెకన్ల పాటు నిలబడి ఉంది. గమనించిన కుటుంబ సభ్యులు వెనక్కి లాగి ఆమె ప్రాణాలు కాపాడారు.

చిన్నారి మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల బాలికకు వినికిడి, మాట్లాడే లోపం ఉంది. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆమె భర్త పోలీసులకు అందించిన సమాచారంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమె డెంటిస్ట్, భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమె కూడా గత కొంత కాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని కుటుంబసభ్యులు వివరించారు.

Tags

Next Story