ఆఫర్ ఉందిగా అని ఫుడ్ ఆర్డర్ ఇస్తే.. రూ. 50,000 కొట్టేశారు!

రోజురోజుకు ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. లాక్ డౌన్ సమయంలో అయితే మరీను.. మెయిన్ గా అమాయక ప్రజలను మోసం చేయడమే సైబర్ క్రిమినల్స్ పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే తాజాగా బెంగుళూరుకి చెందిన సవిత శర్మ అనే ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. 50 వేలు పోగొట్టుకుంది.
బెంగుళూరులోని యలచెనహళ్లిలో నివసిస్తున్న సవితా శర్మ (58) ఫేస్ బుక్ లో ఫుడ్ కి సంబంధించిన ఓ ప్రకటనను చూసింది. ఒక ప్లేట్ మీల్స్ ధరకే అంటే రూ.250 కు మాత్రమే రెండు ప్లేట్ల మీల్స్ ఇస్తామనదే ఆ ప్రకటన సారంశం.. అయితే ఆఫర్ ఆసక్తిగా ఉండడంతో ఆర్డర్ చేసేందుకు ఫోన్ చేసింది.
అయితే ఈ ఆర్డర్ ఇవ్వాలంటే కనీసం రూ.10 చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపారు. మిగితా డబ్బును డేలవరీ సమయంలో ఇవ్వవచ్చు అని వివరించారు. ఇంతలో ఆమెకి మరో ఫోన్ వచ్చింది అందులో వారు బ్యాంకు వివరాలను అడిగితే వెంటనే అందించింది సవిత. అలా చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆమె ఖాతా నుంచి రూ.49,996 విత్‌డ్రా చేశారు..
దీనితో షాక్ అయిన సవిత ఫుడ్ డెలివరీ యాప్ ని సంప్రదించగా, తాము ఎలాంటి డబ్బు తీసుకోలేదని చెప్పారు. దీనితో మోసపోయానని తెలుసుకున్న సవిత కర్ణాటక పోలీసులను ఆశ్రయించింది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com