BETTING APPS: ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొందరు కేటుగాళ్లు ఆన్లైన్ గేమ్స్ పేరుతో బెట్టింగ్ యాప్స్‌ను క్రియేట్ చేసి వాటి సెలబ్రెటీస్‌లో ప్రమోట్ చేసి ప్రజల్లోకి వదులుతున్నారు. వాటితో ఈజీగా డబ్బు సంసాధించుకోవచ్చు అనకున్న అమాయక జనాలు పెట్టుబడులు పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్‌కు అలావాడు పడి అప్పులపాలై.. అవి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుతూనే ఉంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొందరు కేటుగాళ్లు ఆన్లైన్ గేమ్స్ పేరుతో బెట్టింగ్ యాప్స్‌ను క్రియేట్ చేసి వాటి సెలబ్రెటీస్‌లో ప్రమోట్ చేసి ప్రజల్లోకి వదులుతున్నారు. వాటితో ఈజీగా డబ్బు సంసాధించుకోవచ్చు అనకున్న అమాయక జనాలు పెట్టుబడులు పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్‌కు అలావాడు పడి అప్పులపాలై.. అవి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుతూనే ఉంది.
ఈజీ మనీ కోసం...
ఈజీ మనీ కోసం ఇప్పుడు యువత బెట్టింగ్ యాప్స్‌కు అలవాటు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండడం.. ఆన్లైన్ ద్వారా సంపాదించవచ్చనే ఉద్దేశ్యంతో చాలా మంది యువకులు వీటికి అట్రాక్ట్ అవుతున్నారు.. బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షలు, కోట్ల రూపాయలు ఒకేసారి వచ్చి పడతాయా? అంటే నమ్మకం ఉండదనే చెప్పాలి. కానీ వస్తాయనే నమ్మకమే వారిని పెట్టుబడి పెట్టేలా చేస్తుంది. కొంత మందికైతే డబ్బులు పోతాయని కూడా తెలుసు.. కానీ వస్తే లక్షలు వస్తాయనే నమ్మకంతో పెట్టుబడి పెడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ బానిసల్లో అత్యధికులు 18- 25 మధ్య వయసు వాళ్లే ఉంటున్నారని వెల్లడైంది. ఇంటర్మీడియట్ వరకు చవిదిన వాళ్లు 41.8 శాతం ఉన్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికే బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు తేటతెల్లమైంది. కానీ అది తర్వాత వ్యసనంలా మారిపోయింది…ఇటీవల కాలంలో అనేక మంది యువకులు ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్‌లో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు.
నిజానికి మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరంగా పరిగణిస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో నియంత్రిత బెట్టింగ్ అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొన్ని చట్టాలు చేసింది. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పూర్తిగా నిషేధం అమలులో ఉంది. అయితే సిక్కిం గోవా నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం నియంత్రిత బెట్టింగ్ సేవలు అమలులో ఉన్నాయి. నిజానికి తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై నిషేధం ఉంది. దీంతో ఆయా యాప్స్‌లో చాలా వరకు ఇక్కడ పని చేయవు. ఈ కారణంగానే పంటర్లలో 69 శాతం మంది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ వాడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com