Bhopal Crime: లేడీ పోలీస్ ఆఫీసర్ షవర్ బాత్.. డ్రైవర్ చేసిన పాడు పని..

Bhopal  Crime: లేడీ పోలీస్ ఆఫీసర్ షవర్ బాత్.. డ్రైవర్ చేసిన పాడు పని..
Bhopal Crime: మహిళా పోలీసు అధికారి తన ఫిర్యాదులో సెప్టెంబర్ 22 న స్నానం చేస్తున్న సమయంలో ఎవరో తనను చిత్రీకరించడానికి

Bhopal Crime:ఆమె ఓ క్రైం బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. ఎక్కడెక్కడో ఉన్న నేరస్థుల నడ్డి విరిచి కటకటాల వెనక్కి పంపించే సత్తా ఉన్న ధీశాలి.. కానీ పక్కలో బల్లెంలా తన సొంత కారు డ్రైవరే ఆమె స్నానం చేస్తుంటే వీడియో తీసేందుకు ప్రయత్నించాడు.. వెంటనే గుర్తించిన ఆమె పై అధికారులకు ఫిర్యాదు చేసింది.

భోపాల్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్ విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చింది. స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లింది. అప్పటికే డోర్‌కి పెట్టి ఉన్న కెమెరాను ఆమె గమనించుకోలేదు. కానీ స్నానం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు కెమెరా గుర్తించింది. ఆమె దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేసేందుకు పన్నాగం పన్నాడు.

మహిళా పోలీసు అధికారి తన ఫిర్యాదులో సెప్టెంబర్ 22 న స్నానం చేస్తున్న సమయంలో ఎవరో తనను చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు గ్రహించానని పేర్కొన్నారు.

" ఆమె బాత్‌రూమ్ డోర్ వద్ద ఉంచిన మొబైల్ ఫోన్‌ని గమనించారు. అది డ్రైవర్ చేసిన పనే అని తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలించారుని ఆ అధికారి ఆరోపించారు. సెప్టెంబర్ 26 న డ్రైవర్ తన ఇంటికి వచ్చి రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడని ఆమె పై అధికారులకు ఫిర్యాదు చేసారు. అడగిన డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో తన పరువు తీస్తానని బెదిరించాడని ఆమె పేర్కొన్నారు. విషయం పోలీసుల వరకు వెళ్లిందని తెలిసి నిందితుడు పరారయ్యాడు.

భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద బ్లాక్ మెయిల్ మరియు దోపిడీ కేసు నిందితుడిపై నమోదైంది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story