Bihar : ఏడేళ్ల బాలుడు మృతి.. హాస్టల్ ఇంచార్జ్ కోట్టడం వల్లే చనిపోయాడన్న స్నేహితులు

Bihar : ఏడేళ్ల బాలుడు మృతి.. హాస్టల్ ఇంచార్జ్ కోట్టడం వల్లే చనిపోయాడన్న స్నేహితులు

ఏడేళ్ల విద్యార్థి రెసిడెన్షియల్ హాస్టల్ లో మృతిచెందాడు. హోం వర్క్ చేయనందుకు హాస్టల్ ఇంచార్ట్ కొట్టిన మరుసటిరోజు చనిపోయినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. బీహార్ సహర్సా జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదిత్య యాదవ్ LKG చదువుతున్నాడు. హోం వర్క్ పూర్తి చేయనందుకు సుజీత్ కుమార్ అనే హాస్టల్ ఇంచార్జ్ బుధవారం స్కేలుతో ఆదిత్యను కొట్టాడు. మరుసటి రోజు ఉదయం అతని స్నేహితులు చూసేసరికి ఆదిత్య మంచంపై అపస్మారక స్థితిలో ఉన్నాడు. హాస్టల్ ఇంచార్జ్ సుజీత్ కుమార్ కు సమాచారం అందించగా అతను ఆదిత్యను పరిశీలించాడు. చనిపోయాడని నిర్థారించుకుని సీనియర్ విద్యార్థులను ఆదిత్యను హాస్పిటల్ కు తీసుకెళ్లి వదిలి వేయవలసిందిగా చెప్పినట్లు 4వ తరగతి విద్యార్థి తెలిపాడు.


బాలుడి తండ్రికి ఫోన్ చేసి స్పృహతప్పి పడిపోయాడని వచ్చి తీసుకెళ్లమని సుజీత్ కుమార్ చెప్పాడు. బాలుడి తండ్రి హాస్పిటల్ కు చేరేలోగా ఆదిత్య ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారు. బాలుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, శవపరీక్ష తర్వాతే మృతికిగల కారణాలు తెలియవచ్చని అన్నారు. ఆదిత్యను బుధవారం రాత్రి సుజీత్ కొట్టడంవల్లే చనిపోయినట్లు విద్యార్థులు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలను సుజీత్ కొట్టిపారేశాడు. ప్రస్తుతం సుజీత్ కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Next Story