Bihar: అయ్యో.. ఆస్తి కోసం నానమ్మని.. లారీ ఎక్కించి మనవడు..

Bihar: అయ్యో.. ఆస్తి కోసం నానమ్మని.. లారీ ఎక్కించి మనవడు..
Bihar: వారసత్వ సంపద కోసం ఒకరినొకరు కొట్టుకుంటుకుంటున్నారు.. అడ్డొస్తే హత్యలు చేయడానిక్కూడా వెనుకాడ్డం లేదు.

Bihar: బంధాలు, బంధుత్వాలు అన్నీ కనుమరుగవుతున్నాయి.. ఆస్తుల కోసం అన్నీ మరిచి పోతున్నారు.. అయిన వాళ్లని, వృద్ధాప్యంలో ఉన్నవారిపై కూడా కనీసం జాలి దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు. కష్టపడి సంపాదించుకోవాల్సింది పోయి వారసత్వ సంపద కోసం ఒకరినొకరు కొట్టుకుంటుకుంటున్నారు.. అడ్డొస్తే హత్యలు చేయడానిక్కూడా వెనుకాడ్డం లేదు.

తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ యువకుడు తన నానమ్మను చంపేశాడు. ఆస్తి కోసం ఆమె పైకి లారీ ఎక్కించి ఆమె మరణానికి కారణమయ్యాడు. అయ్యో.. ఆస్తి కోసం నానమ్మని.. లారీ ఎక్కించి మనవడు..జఫర్‌పూర్‌లో ఓ యువకుడు కుటుంబ ఆస్తుల తగాదా కారణంగా తన నానమ్మ డోమ్నీ దేవి పైకి లారీ ఎక్కించి హత్య చేశాడు. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని కర్జా పోలీస్ స్టేషన్‌లోని రక్ష గ్రామంలో జరిగింది.

నిందితుడు దిలీప్, లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దసరా పండుగ కోసం ఇంటికి వచ్చాడు. అప్పటికే రెండు రోజుల నుంచి ఇంట్లో వివాదం జరుగుతోంది. ఆదివారం, దిలీప్ తన నానమ్మను వేధించడం ప్రారంభించాడు. నువ్వే "అన్ని గొడవలకు మూలం" నిన్ను చంపేస్తా.. అని ఆవేశంతో అరుచుకుంటూ బయటకు వెళ్లాడు. దిలీప్ తండ్రి, రాజేశ్వర్ రాయ్ కొడుకును మందలించాడు.

కానీ ఆవేశం చల్లారని దిలీప్ వెంటనే లారీ ఎక్కి అక్కడే కూర్చున్న నానమ్మ పైకి పోనిచ్చాడు. వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన తరువాత దిలీప్ తండ్రి రాజేశ్వర్ రాయ్ కర్జా పోలీస్ స్టేషన్‌లో తన తల్లి డోమ్నీ దేవిని కొడుకు హత్య చేసినట్లు కేసు పెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు నిందితుడిని అరెస్టు చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని కర్జా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ నేహా శ్రీవాస్తవ తెలిపారు.

Tags

Next Story