Mona Roy: మోడల్‌పై హత్యాయత్నం.. బైక్‌పై వచ్చి..

Mona Roy (tv5news.in)
Mona Roy: మనిషిపై మనిషి ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నాడో.. ఆ ద్వేషం ఎంతవరకు దారితీస్తుందో ఎవరం చెప్పలేకపోతున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీ స్టేటస్‌ను పెంచుకుంటున్న వారికి ఫ్యాన్స్‌కంటే ఎక్కువ శత్రువులే పుట్టుకొస్తున్నారు. తాజాగా పాట్నాలో ఒక టిక్‌టాకర్‌పై హత్యాయత్నం జరిగింది. అయిదు రోజుల నుండి చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ మహిళ ఈరోజు (ఆదివారం) ఉదయం కన్నుమూసింది.
36 ఏళ్ల మోనా రాయ్.. మంగళవారం సుమారు రాత్రి 10 గంటలకు తన కూతిరితో కలిసి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి తనను గన్‌తో కాల్చారు. బుల్లెట్ నేరుగా తన గుండెల్లోకి దూసుకుపోయేసరికి తను అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తన 11 ఏళ్ల కూతురు ఏ ప్రమాదం లేకుండా బయటడగలిగింది. ఈ ఘటన వారు నివాసముంటున్న రామ్‌నగర్ కాలనీలో చోటుచేసుకుంది.
ఘటన గురించి తెలుసుకున్న రాజీవ్ నగర్ పోలీసులు తనను వెంటనే హాస్పటల్‌కు తరలించారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న మోనా ఆదివారం ఉదయం కన్నుమూసింది. ఇక తనను కాల్చిన వారు ఎవరు, వారికి తనకు ఏంటి సంబంధం అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు వారికి ఒక్క క్లూ కూడా దొరకకపోవడం గమనార్హం. అయితే టిక్‌టాకర్ మాత్రమే కాదు 2021 మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ బీహార్ మోడలింగ్ కాంపిటీషన్ పోటీలో రన్నరప్ కూడా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com