పందిట్లో పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్‌తో వధువు జంప్.. చెల్లెలి మెడలో తాళికట్టేసరికి..

పందిట్లో పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్‌తో వధువు జంప్.. చెల్లెలి మెడలో తాళికట్టేసరికి..

ఆ ఏడుపేదో ముందే ఏడవొచ్చుగా.. పెళ్లి పీటల మీద కూర్చున్నాక ఇదేం పోయే కాలం.. కనీసం ఆ పిల్ల చెల్లెల్నయినా కట్టబెట్టండి అని మగ పెళ్లి వారు ఆడపెళ్లి వారి మీద విరుచుకుపడ్డారు. 15 ఏళ్లున్న ఆ అమ్మాయిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి బిక్క ముఖం వేసుకుని పెళ్లిపీటల మీద కూర్చున్న కొడుకు చేత మూడు ముళ్లు వేయించారు అబ్బాయి తల్లిదండ్రులు. అయితే అత్తారింటికి వెళ్లిన ఆ బాలికను పోలీసులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాల్య వివాహాలు నిషేధించబడినందున పోలీసులు బాలికను తన అత్తగారి ఇంటి నుండి రక్షించారు అని సీనియర్ అధికారి చెప్పారు.

జైపట్న పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్పాడా గ్రామానికి చెందిన వధువు వివాహం చేసుకోవడానికి కొన్ని గంటల ముందు తన ప్రియుడితో పారిపోయింది. వరుడి తల్లిదండ్రులు కనీసం మీ చిన్న కుమార్తెను అయినా ఇచ్చి వివాహం చేయమని గొడవ చేశారు. చేసేదేం లేక పదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను ఇచ్చి 26 ఏళ్ల ఆ వరుడికి కట్టబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అత్తారింటికి చేరుకున్న బాలిక దగ్గరకు వెళ్లారు.

18 ఏళ్లు వచ్చే వరకు బాలికను తల్లిదండ్రుల వద్దనే ఉంచాలని చెప్పారు. మేజర్ అయిన తరువాతే బాలికను కాపురానికి పంపించాలని తల్లిదండ్రులను ఒప్పించారు. అప్పటి వరకు బాలికకు సంబంధించిన బాగోగులు చూసే బాధ్యతో పాటు, ఎంత వరకు చదువుకుంటానంటే అంత వరకు చదివించమని చెప్పారు. బాలిక చదువుకునేందుకు అవసరమైన సహాయం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.

"రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ సెషన్‌ను పోలీసులు నిర్వహించారు. వారిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాల్య వివాహం చట్టవిరుద్ధం అని వధువు తల్లిదండ్రులకు గానీ వరుడి కుటుంబానికి తెలియక పోవడం. ఈ సంఘటన గురించి అడిగినప్పుడు బాలిక తండ్రి వరుడి తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగానే తన చిన్న కుమార్తెకు పెళ్లి చేయాల్సి వచ్చిందని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story