Rajasthan: చెల్లెలిపై అన్నయ్యల లైంగిక దాడి.. సమర్థించిన పెద్దమ్మ..

Rajasthan: చెల్లెలిపై అన్నయ్యల లైంగిక దాడి.. సమర్థించిన పెద్దమ్మ..
Rajasthan: ఒక్కసారి కాదు దాదాపు రెండేళ్లలో వీరిద్దరు చాలాసార్లు తమ చెల్లిపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నారు.

Rajasthan: పెద్ద పెద్ద చదువులు చదివి, కెరీర్‌ను ఏర్పాటు చేసుకోవాలి అనుకునే ఎంతోమంది అమ్మాయిల జీవితాలు లైంగిక దాడి వల్ల ఆగిపోవడం చూస్తూనే ఉంటాం. మళ్లీ అలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది. శారీరిక వాంఛ తీర్చుకోవడానికి వరసలు కూడా మర్చిపోతున్నారు కొందరు. అందుకే ఏకంగా చెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు అన్నలు.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలోని గంజ్ గ్రామానికి చెందిన ఓ 19 ఏళ్ల అమ్మాయి ఊరిలోకి ఉంటే పైచదువులకు కష్టమవుతుందని, పట్నంలో ఉన్న పెద్దమ్మ వాళ్ల ఇంటికి వచ్చింది. ఒకరోజు ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తనకు అన్నయ్య వరస అయ్యే పెద్దమ్మ కొడుకులు ఇద్దరు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఒక్కసారి కాదు దాదాపు రెండేళ్లలో వీరిద్దరు చాలాసార్లు తమ చెల్లిపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి మరీ.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీని వల్ల యువతి ప్రెగ్నెంట్ అవ్వడంతో విషయం పెద్దమ్మకు చెప్పింది. విషయం తెలుసుకున్న పెద్దమ్మ కొడుకులను ఏమీ అనకుండా, ఎవరికీ తెలియకుండా ఆ యువతికి అబార్షన్ చేయించింది.

ఇంత జరిగిన తర్వాత కూడా.. యువతి అన్నయ్యలు ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో యువతి ఇన్నాళ్లకు ధైర్యం తెచ్చుకొని పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. వెంటనే పోలీసులు పెద్దమ్మతో పాటు ఇద్దరు కొడుకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story