Maharastra: ఛీ ఛీ భర్తకాదు.. దుర్మార్గుడు..

Maharastra: ఛీ ఛీ భర్తకాదు.. దుర్మార్గుడు..
Maharastra: కట్టుకున్న ఇల్లాలితో గొడవపడి ఆమెపై పగ సాధించాలనుకున్నాడు ఓ నీచ భర్త.

Maharastra: మనుషులు మృగాల్లా తయారవుతున్నారు. కనీస ఆలోచన లేకుండా పోతున్నారు.. కట్టుకున్న ఇల్లాలితో గొడవపడి ఆమెపై పగ సాధించాలనుకున్నాడు ఓ నీచ భర్త. భార్యపై అత్యాచారం చేయమని యజమానిని పురిగొల్పాడు. మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్యపై ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త. తాను పని చేస్తున్న పొలం యజమానిని, అతడి సోదరుడిని పిలిచి భార్యపై అత్యాచారం చేయించాడు..

నిలంగా ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి సారోలా రోడ్ వద్ద వ్యవసాయ క్షేత్రంలో నివసిస్తోంది. కొద్ది రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె లాతూర్ లో నివసిస్తున్న తన తల్లి వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. కుమార్తెకు సర్థి చెప్పి ఆమెను మళ్లీ భర్త వద్దకు పంపించింది తల్లి. కొన్ని రోజులు బాగానే ఉన్నా మళ్లీ ఏప్రిల్ 9న భార్యాభర్తలు గొడవ పడ్డారు.

దీంతో భార్యపై కోపంతో రగిలిపోయిన భర్త రాత్రి 9 గంటల సమయంలో పొలం యజమాని, అతని సోదరుడిని పిలిచి భార్యపై అత్యాచారం చేయమని ప్రోత్సహించాడు. దీంతో వారిద్దరూ భర్త కళ్లెదుటే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. ఘటన తర్వాత.. మహిళ ఏడ్చుకుంటూ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడ కూడా ఆమె గోడును వినేవారు లేరు.. జిల్లా ఎస్పీని కలవమని సూచించారు. ఎస్పీ నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం పోలీసులు మహిళ భర్తను, అత్యాచార నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story