Ranga Reddy : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన 'బుల్లెట్ బండి సాంగ్' పెళ్లికొడుకు..

Ranga Reddy : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బుల్లెట్ బండి సాంగ్ పెళ్లికొడుకు..
X
Ranga Reddy : బుల్లెట్‌ బండి సాంగ్‌తో ఫేమస్‌ అయిన పెళ్లి కొడుకు మరోసారి ఫేమస్‌ అయ్యాడు

Ranga Reddy : బుల్లెట్‌ బండి సాంగ్‌తో ఫేమస్‌ అయిన పెళ్లి కొడుకు మరోసారి ఫేమస్‌ అయ్యాడు. లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దోరికిపోయాడు. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగా పని చేస్తున్న అశోక్‌... 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అశోక్‌ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో బుల్లెట్‌ బండి సాంగ్‌లో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యాడు అశోక్‌. అతను బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగా పని చేస్తున్నారు. ఓ ఇంటి నిర్మాణానికి పర్మిషన్‌ ఇవ్వాలంటే 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో... లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రైడ్స్‌ చేశారు. జిల్లాగూడకు చెందిన దేవేందర్‌ రెడ్డి ఇంటి అనుమతి కోసం టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ అశోక్‌ 30 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దేవేందర్‌ రెడ్డి ఫిర్యాదుతో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాగోల్‌లోని రాక్‌టౌన్‌ కాలనీలో అశోక్‌ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.

Tags

Next Story