Eluru : ప్రముఖ వ్యాపారవేత్త మనవడు కిడ్నాప్..

Eluru : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ప్రముఖ వ్యాపారవేత్త గుడివాడ సాయి మనవడు ఆగస్త్యను దుండగులు కిడ్నాప్ చేసారు. ఇండికా కారులో బాలుడిని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇస్తేనే ఆగస్త్యను విడుదల చేస్తామని కిడ్నాపర్లు ఫోన్ చేసి బెదిరించినట్లు బాలుడి కుటుంబసభ్యులు తెలిపారు. గుడివాడ సాయి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా విచారణ చేపట్టారు.
అగస్త్య కరాటే క్లాసులకు వెళ్లి సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు కిడ్నాప్‌కు పాల్పడ్డారు. సైకిల్‌పై ఉన్న బాలుడిని బలవంతంగా కారులో ఎక్కించుకోగా.. అది గమనించిన స్థానికులు కారు అద్దాలను ధ్వంసం చేసి ఆగస్త్యను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ దుండగులు కారును ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత కిడ్నాపర్ల కారును స్థానికులు వెంబడించినా దొరకలేదు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టినా.. ఇప్పటివరకు కిడ్నాపర్లు, కారు ఆచూకీ లభించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com