Kapra : కాప్రాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం..

X
Kapra : హైదరాబాద్ కాప్రాలోని పంపుగూడ లక్ష్మీ విల్లాస్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఉప్పల సురేష్ అనే వ్యాపారవేత్త జెండా వందనంలో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు. ఈ పరిణామంతో కాప్రాలో విషాద వాతావరణం చోటు చేసుకుంది. మృతుడు సురేష్ బాగ్ అంబర్ పేట్ డిడి కాలనీలో ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. కాలనీవాసులకు స్వాతంత్ర్యం ముందు నాటి విశేషాలు చెబుతుండగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి.. మృతి చెందారు. హఠాత్ పరిణామంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
