Madhya Pradesh: వాటర్ ట్యాంక్‌లో రూ.8 కోట్లు.. హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టి..

Madhya Pradesh: వాటర్ ట్యాంక్‌లో రూ.8 కోట్లు.. హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టి..
Madhya Pradesh: డబ్బును ఐటీ అధికారులకు దొరక్కుండా దాచుకునేందుకు వ్యాపారులు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

Madhya Pradesh: లెక్కల్లో చూపని డబ్బును ఐటీ అధికారులకు దొరక్కుండా దాచుకునేందుకు వ్యాపారులు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.. మొన్నటికి మొన్న బెంగళూరులో ఓ వ్యాపారి ఐటీ సోదాలకు భయపడి పైప్‌ లైన్‌లో కోట్ల రూపాయలు దాచిపెడితే.. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ లిక్కర్‌ వ్యాపారి 8 కోట్ల డబ్బును అండర్‌ గ్రౌండ్ వాటర్‌ ట్యాంక్‌లో దాచిపెట్టాడు.

అయితే, వ్యాపారి తెలివిని ముందుగానే పసిగట్టిన ఐటీ అధికారులు సంపులో దాచిపెట్టిన కోట్ల రూపాయల్ని బయటకు తీశారు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌ జిల్లాలో వెలుగు చూసింది.. లిక్కర్ వ్యాపారి శంకర్ రాయ్ పై అనేక ఫిర్యాదులు రావడంతో.. ఐటీ అధికారులు అతని ఇంటిపై మెరుపు దాడులు చేశారు. లెక్కల్లో చూపని డబ్బు కోసం ఇల్లంతా వెతికారు..

చివరకు ఇంటి కిందున్న సంప్‌లో డబ్బు సంచులను గుర్తించారు. నోట్లు తడిసి ఉండడంతో వాటిని ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేశారు. హెయిర్ డ్రయర్ తో ఆరబెట్టారు. స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు విలువ 8 కోట్లని చెప్పారు అధికారులు. డబ్బుతోపాటు 5 కోట్ల విలువజేసే 3 కిలోల బంగారాన్ని కూడా అధికారులు చేసుకున్నారు. రాయ్ ఇంట్లో మొత్తం 39 గంటల పాటు సోదాలు చేశారు అధికారులు. గతంలో కాంగ్రెస్ మద్ధతుతో దామోహ్ నగర పాలక ఛైర్మన్ గా పని చేశారు శంకర్ రాయ్.


Tags

Next Story