Hyderabad : సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో లైంగిక వేధింపులు..

Hyderabad : హైదరాబాద్‌లోని కాల్ హెల్త్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. కాల్ హెల్త్ సర్వీసెస్ కంపెనీ సీఈవో తాళ్లపల్లి హరి, రిపోర్టింగ్ మేనేజర్ బత్తిని వంశీ వేధిస్తున్నారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. గత కొన్ని నెలలుగా రిపోర్టింగ్ మేనేజర్ వంశీ... తనను లైంగికంగా వేధిస్తున్నాడని... అయితే ఈ విషయాన్ని సీఈవో తాళ్లపల్లి హరికి ఫిర్యాదు చేస్తే.. అతను కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.
కాల్ హెల్త్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ రిపోర్టింగ్ మేనేజర్ బత్తిని వంశీ వేధింపులపై ఇప్పటికే కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశామని... అయితే పెద్ద స్థాయి వ్యక్తులు కావడంతో ఎవరూ స్పందించలేదని బాధితురాలు వాపోయింది. ఇప్పటివరకు కంపెనీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని టీవీ5 ముందు గోడు చెప్పుకుంది. కాల్‌హెల్త్ సర్వీసెల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో తాళ్లపల్లి హరి, రిపోర్టింగ్ మేనేజర్ బత్తిని వంశీపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. అయితే పోలీసుల విచారణకు సహకరిస్తామంటోంది కాల్ హెల్త్ సర్వీసెస్ కంపెనీ యాజమాన్యం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com