Kamareddy : వాగులో చిక్కుకున్న కారు.. తప్పిన పెను ప్రమాదం..

Kamareddy : వాగులో చిక్కుకున్న కారు.. తప్పిన పెను ప్రమాదం..
Kamareddy : కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తడ్వాయి మండలం సోమారం పేట శివారులో పాలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది

Kamareddy : కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తడ్వాయి మండలం సోమారం పేట శివారులో పాలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.వాగులో వరద నీటి ఉదృతికి ఓ కారు చిక్కుకుంది. కారులోనే ముగ్గురు కేకలు వేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమయి. కారుకు తాడు కట్టి ట్రాక్టర్ సహయంతో కారును బయటకు తీశారు. గంటపాటు కారులోనే ఈ ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. వాగులో నుండి కారును బయటకు తీయడంతో ముగ్గురు ప్రాణాపాయం నుండి బయటకు వచ్చారు. ఇంకా మరికొంత సమయం దాటితే కారు వాగులో కొట్టుకుపోయి ఉండేది. గ్రామస్థుల సహాయంతో కారులో వారు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..

Tags

Next Story