Crime News: 31 ఏళ్ల మహిళ 13 ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని..

Crime News: సమాజం ఎటు పోతోంది.. తాము చేస్తున్న పని వల్ల సమాజ బహిష్కరణకు గురవుతామని తెలిసి కూడా కోరికలను చంపుకోలేకపోతున్నారు. వయసు తారతమ్యాలను మరిచి ప్రవర్తిస్తున్నారు. కొడుకు వయసున్న కుర్రవాడితో ప్రేమాయణం సాగించి అభం శుభం తెలియనా ఆ బాలుడిని లైంగిక చర్యకు పురిగొల్పింది. ఇప్పుడు ఓ బిడ్డకు తల్లైంది. 31 ఏళ్ల ఆండ్రియా తనకు సహాయకుడిగా ఉండేందుకు 13 ఏళ్ల బాలుడిని ఇంట్లో ఉంచుకుంది. ఇరుగుపొరుగు వారు ఆ బాలుడిని ఆమె కొడుకుగా భావించేవారు. అయితే బాలుడిపట్ల ఆకర్షితురాలైన ఆండ్రియా అతడిని లైంగిక అవసరాలకు వాడుకుంది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. విషయం వెలుగులోకి రావడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటన అమెరికాలోని కొలరాడోలో చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఆండ్రియా సెరానో అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆండ్రియాను సెక్స్ అపరాధిగా పరిగణించకూడదని కోర్టు పరిగణించడంతో జైలు జీవితం నుంచి తప్పించుకుంది. కానీ 13 ఏళ్ల బాలుడి తల్లి కోర్టు తీర్పుపై తన అసమ్మతిని తెలియజేసింది. తన కొడుకు బాల్యాన్ని కోల్పోయాడని ఆమె ఆరోపించింది. ఆమెకు శిక్ష వేయకుండా కనికరం చూపుతున్నారు” అని బాధితురాలి తల్లి కొడుకు జీవితం నాశనమైపోయిందని ఆవేదన చెందుతోంది. కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా బాలుడి తల్లిదండ్రులు తిరిగి అప్పీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com