HARISH RAO: హరీశ్‌రావు బంధువులపై కేసు నమోదు

HARISH RAO: హరీశ్‌రావు బంధువులపై కేసు నమోదు
X

మాజీ మంత్రి హరీశ్‌రావు బంధువులపై కేసు నమోదు అయింది. హరీష్ రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురిపై మియాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. తనకి తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వారిపై ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదు చేశారు. తన ఐదంతస్తుల బిల్డింగ్ కోసం 2019 నుంచి పోరాటం చేస్తున్నట్లు లచ్చిరాజు చెబుతున్నాడు. తన్నీరు గౌతమ్‌, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్‌ గౌడ్‌, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావుపై కేసు నమోదు చేశారు. ఫోస్మో హాస్పిటాలిటీ పేరుతో ప్రామిసరీ నోటు తీసుకుని చీటింగ్‌కు పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. హరీశ్‌రావు బంధువులు తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని తెలిపారు. జంపన ప్రభావతి తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారని ఆరోపించారు.

కేంద్రానికి హరీశ్‌రావు ప్రశ్నలు

కేంద్రంపై వరుసగా ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు. పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉందని నిలదీశారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతుల పట్ల ఎందుకీ వివక్ష అని మండిపడ్డారు. గుజరాత్ పత్తికి క్వింటాకు రూ. 8,257 చెల్లిస్తున్న ప్రభుత్వం.. తెలంగాణ పత్తికి మాత్రం రూ.7,521 చెల్లిస్తోందంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story