Khammam Crime: దారుణం.. లిప్ట్ ఇస్తే చంపేశాడనుకున్నారు.. కానీ ఇంటావిడ చెప్తేనే..

Khammam Crime: దారుణం.. లిప్ట్ ఇస్తే చంపేశాడనుకున్నారు.. కానీ ఇంటావిడ చెప్తేనే..
Khammam Crime: అమ్మాయికి పెళ్లైంది.. అల్లుడు వచ్చాడు.. అయినా ఆమె అడ్డదారులు తొక్కింది. అడ్డొచ్చిన భర్తను చంపేందుకు కుట్ర పన్నింది.

Khammam Crime: అమ్మాయికి పెళ్లైంది.. అల్లుడు వచ్చాడు.. అయినా ఆమె అడ్డదారులు తొక్కింది. అడ్డొచ్చిన భర్తను చంపేందుకు కుట్ర పన్నింది. అందులో భాగమే బైక్‌పై వస్తున్న భర్తను ఇంజక్షన్ ఇచ్చి చంపేయమని ప్లాన్ చేసింది ఓ మహా ఇల్లాలు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. వివాహేతర సంబంధమే జమాల్ సాహెబ్ హత్యకు కారణమని కనుగొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముదిగొండ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కరోజులోనే కేసును ఛేదించిన పోలీసులు మంగళవారం సాయంత్రం ఆటోరిక్షా డ్రైవర్‌, ట్రాక్టర్‌ డ్రైవర్‌, ఆర్‌ఎంపీ వైద్యుడితో సహా మృతుని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మృతుడి భార్యకు, ఆటో డ్రైవర్‌కు మధ్య అక్రమ సంబంధం కారణంగా జమాల్‌కు, ఆటోడ్రైవర్‌కు కొద్దిరోజుల క్రితం గొడవ జరిగింది. ఆటో డ్రైవర్ మరో ఇద్దరితో కలిసి సాహెబ్‌ను హత్య చేయాలని రెండు నిలల క్రితమే పథకం వేశాడు. అదను కోసం వేచి చూశాడు. సోమవారం దానిని అమలు చేశాడు. బైక్‌పై వస్తున్న జమాల్‌ను లిప్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు.

జమాల్ భార్య ఫోన్‌కాల్ డేటాలో హత్యకు పాల్పడ్డ నిందితుల ఫోన్ నెంబర్లు ఉండడం, వారితో ఆమె ఎక్కువ సార్లు మాట్లాడడంతో పోలీసులకు బలమైన ఆధారాలు దొరికినట్లైంది. దీంతో కేసును సులభంగా ఛేదించగలిగారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. జమాల్ భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Tags

Next Story