రాజకీయ కారణాలతోనే వివేకా హత్య: సీబీఐ

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని బుధవారం వరకు ఆరెస్ట్ చేయోద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అవినాష్ తల్లి అనారోగ్యం కారణంగా హైకోర్టు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా అవినాష్ తరుపు న్యాయవాదులు బుధవారం వరకు అరెస్ట్ చేయకుండా అదేశాలు ఇవ్వవలసిందిగా కోర్టును అభ్యర్ధించారు. దీంతో హైకోర్టు సీబీఐ అభిప్రాయం కోరింది. అయితే తమకు అభ్యంతరం లేదని తెలపడంతో ముందస్తు బెయిల్ ఇవ్వకుండా కేవలం బుధవారం వరకు మాత్రమే ఆరెస్ట్ కాకుండా సాధారణ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ముందస్తు బెయిల్ పై తుది తీర్పు ఈనెల 31న వెలువరిస్తామంటూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
రాజకీయ కారణాలతోనే వివేకాను హత్య చేశారంటూ సీబీఐ హైకోర్టులో వాదనలను వినిపించింది. ఇందుకు అవినాష్ రెడ్డి నుంచి సహ నిందితులకు పెద్ద మొత్తంలో నిధులు చేరాయన్నారు.. వాటిలో 46 లక్షలను తాము స్వాధీనం చేసుకున్నామని హైకోర్టు దృష్టికి తెచ్చారు. సీబీఐ తరపున లాయర్లు తమకు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని హైకోర్ట్‌లో జడ్జికు వివరించారు. వివేకా హత్య కేసులో అనుమానం ఉన్న చాలా మందిని విచారించామని.. కానీ అందరూ తమకు సరిగా విచారణ చేయడానికి సహకరించారన్నారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం తాము ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు.
వివేకా హత్య కేసులో దర్యాప్తు కోసం అవినాష్ రెడ్డికి ఇప్పటికి చాలా సార్లు నోటీసులు పంపించామని.. కానీ ఎప్పటికప్పుడు ఏవేవో కారణాలు చెబుతూ విచారణకు గైర్హాజరు అవుతున్నారంటూ కోర్టుకు చెప్పుకున్నారు. ఈ కేసులో విచారణను అడ్డుకోవడానికి మొదటి నుండి ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ చెప్పారు. ఇక ముందస్తు బెయిల్ కోసం అని కోర్టుల చుట్టూ తిరుగుతూ పిటిషన్‌లు వేస్తున్నారంటూ సీబీఐ తరపున లాయర్ కోర్టుకు విన్నవించారు.. అవినాష్ రెడ్డికి వివేకా హత్యలో ప్రమేయం లేనప్పుడు ఎందుకు విచారణకు సహకరించడం లేదని వాదించారు.
వివేకా హత్యకు నెలరోజుల ముందే కుట్ర జరిగిందని సీబీఐ లాయర్.. హైకోర్టుకు తెలిపారు. వివేకా హత్య వెనుక రాజకీయ కారణం ఉందని వాదించారు. అదేవిధంగా అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిం చినట్లు ఏమైనా ఫిర్యాదులు అందాయా అని ప్రశ్నించిన కోర్టుకు, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వడానికి సాక్షులు ముందుకు రావడం లేదని, అతను చాలా ప్రభావిత వ్యక్తి అని సమాధానం ఇచ్చారు సీబీఐ తరపు లాయర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com