Meerpet Murder : మీర్‌పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు..!

Meerpet Murder : మీర్‌పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న శ్వేతారెడ్డి... ఒక ప్రియుడితో... మరో ప్రియుడిని హత్య చేయించింది. ఈ ఘటనపై పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించారు. యశ్విన్‌కుమార్‌ను అశోక్ సుత్తితో కొట్టి చంపినట్లు నిర్ధారించారు. హత్య తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులు గమనించడంతో... సహాయం చేస్తున్నట్లు నటించి... అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాగ్ అంబర్ పేట ప్రాంతానికి చెందిన యశ్విన్ కుమార్‌కు శ్వేతారెడ్డితో 2018లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే శ్వేతకు వివాహమైంది. అయితే వీరి పరిచయం వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆకర్షణగా మారి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం చాలా దూరం వరకు వెళ్ళింది. అప్పటికే వివాహం అయినప్పటికీ, శ్వేతా రెడ్డి ఫోటో గ్రాఫర్‌తో సాన్నిహిత్యంగా మెలిగారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య న్యూడ్ వీడియో కాలింగ్ కొనసాగింది.
ఈ క్రమంలో యశ్విన్ కుమార్ తనను పెళ్లి చేసుకోవాలంటూ శ్వేతా రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే… ఆమె ఒప్పుకోకపోయేసరికి న్యూడ్ ఫొటోస్‌ను చూపించి తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని బయటపెడతానని బెదిరించాడు. దీనితో అతని వేధింపులు భరించలేకే ఆమె తన ప్రియుడు, మరో ఇద్దరి సాయంతో కలిసి అతనిని హత్య చేయించినట్లు ఒప్పుకుంది. దీనితో రాచకొండ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com