Crime News: సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష అనుమానాస్పద మృతి
Crime News: టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల బంజారాహిల్స్‌లోని తన ఇంట్లో శనివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Crime News: టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల బంజారాహిల్స్‌లోని తన ఇంట్లో శనివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
35 ఏళ్ల ప్రత్యూష బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిల్మ్ నగర్‌లో ఓ ఇంట్లో నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం, భద్రతా తనిఖీలకు ఆమె స్పందించకపోవడంతో, గార్డులు ఇంటికి చేరుకున్న పోలీసులను అప్రమత్తం చేశారు.
పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్‌రూమ్‌లో ఆమె శవమై కనిపించింది. వాష్‌రూమ్‌లో రసాయనాల బాటిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యూష డిప్రెషన్‌లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలో ఉన్న బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రత్యూష ప్యాషన్ ప్రపంచంలో తన సొంత ఇమెజ్ ని క్రియేట్ చేసుకుంది. ఆమె ఉత్పత్తులు ప్రత్యూష గరిమెళ్ల బ్రాండ్ పేరుతో విక్రయించబడుతుంటాయి.
ప్రత్యూష అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ చదివి హైదరాబాద్‌లో కెరీర్ ప్రారంభించింది. ఆమె 2013లో తన పేరు మీద ఒక లేబుల్‌ని ప్రారంభించింది. ఆమె టాలీవుడ్, బాలీవుడ్‌లో చాలా మంది ప్రముఖుల కోసం పనిచేసింది. ఆమె ఖాతాదారులలో పెద్ద పెద్ద సెలబ్రెటీలు ఉన్నారు.
RELATED STORIES
Badam Tea: బాదం టీతో ఆరోగ్యం.. అందం కూడా..
11 Aug 2022 2:35 AM GMTCoffee with Ghee: క్రేజీ కాంబినేషన్.. నెయ్యితో కాఫీ
10 Aug 2022 6:00 AM GMTWater: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు..
8 Aug 2022 9:15 AM GMTDiabetic Foot Symptoms: చక్కెర వ్యాధి గ్రస్తులకు పాదాల సమస్యలు.....
6 Aug 2022 9:30 AM GMTEight lifestyle tips: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఎనిమిది...
4 Aug 2022 9:14 AM GMTHair Fall:వర్షాకాలంలో జుట్టుకి పోషణ.. వెంట్రుకలు రాలడం నివారించేందుకు...
3 Aug 2022 8:00 AM GMT