ఎన్టీఆర్ జిల్లాలో గొలుసుకట్టు వ్యాపారం మోసం

ఎన్టీఆర్ జిల్లాలో గొలుసుకట్టు వ్యాపారం మోసం

ఓ యాప్ లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మోస పోయిన ఘటన... ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లిలో జరిగింది. మార్సెక్ అనే యాప్‌లో దాదాపు 15 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు స్థానికులు. కొండపల్లికి చెందిన కృష్ణ అనే యువకుడి ద్వారా యాప్‌లో పెట్టుబడి పెట్టారు. ఇలా పెట్టుబడి పెట్టివాళ్లకు వారం వారం రూ.1500 నుంచి 2 వేల రూపాయలు వస్తుండటంతో.. స్థానికులు భారీగా పెట్టుబడి పెట్టారు. ఒక్కొక్కరు 40వేల,ు లక్ష, రెండు లక్షల చొప్పు న పెట్టుబడులు పెట్టారు. ఒకరు భార్య పుస్తెలు తాకట్టుపెట్టి, మరొకరు ఆటోను అమ్మి... ఈ యాప్‌ లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే... ఉన్నట్టుండి.. ఈ యాప్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో మోసపోయామని గ్రహించారు బాధితులు. పెట్టుబడి పెట్టించిన కృష్ణకు ఫోన్ చేశారు. అయితే.. అతని ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో .. బాధితులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇదే యాప్‌ పేరుతో ఓ కంటైనర్‌ లారీని గుర్తించారు. దీంతో ఆ కంటైనర్ లారీనీ అడ్డగించి డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నారు. బాధితుల సమాచారంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు.. డ్రైవర్ అదుపులో తీసుకున్నారు. కంటైనర్కు యాప్ కు సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story