Punjab : చండీగఢ్ యూనివర్సిటీలో దారుణం.. వరుసగా విద్యార్ధినుల ఆత్మహత్యలు..

Punjab : చండీగఢ్ యూనివర్సిటీలో దారుణం.. వరుసగా విద్యార్ధినుల ఆత్మహత్యలు..
Punjab : పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో దారుణం జరిగింది

Punjab : పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. ఒక విద్యార్థిని తన సహ విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి సిమ్లాలోని ఓ యువకుడికి పంపింది. ఆ వీడియోలను అతడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు. విషయం కాస్త యువతుల దృష్టికి రావడంతో.. తమ వీడియోలు చూసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఇప్పటికే ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా మరో ఎనిమిది మంది ఆత్మహత్యకు యత్నించారని సమాచారం.

విద్యార్థినుల వీడియోల లీకు వ్యవహారంపై చండీగఢ్ యూనివర్సిటీ అట్టుడుకుతోంది. వందలాది మంది విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. మరోవైపు నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా.. నిందితురాలైన విద్యార్థిని మొహాలి నివాసి అని, ఆమె తీసిన వీడియోలను పరీక్ష నిమిత్తం ఫోరెనిక్స్‌కు పంపినట్లు పోలీసులు చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

యూనివర్సిటీలో ఎంబీయే చదువుతోన్న విద్యార్థిని.. 60మందికిపైగా ప్రైవేటు వీడియోలు తీసినట్టు, అవన్నీ తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపానని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ ఒక్కసారిగా బాంబు లాంటి ప్రకటన చేసింది. ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీక్ అయినట్లు స్పష్టం చేసింది. ఓ అమ్మాయి తన సొంత వీడియోను సోషల్ మీడియాలో తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని వెల్లడించింది.

అలాగే చండీగఢ్ యూనివర్సిటీలో ఎనిమిది మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని యూనివర్సిటీ ఛాన్సలర్‌ చెబుతున్నారు. ఏ ఒక్క విద్యార్థిని ఆసుపత్రిలో చేరలేదని వెల్లడించారు. అయితే ఇంత జరిగినా యాజమాన్యం మాత్రం వీటన్నిటినీ కొట్టిపారేస్తూ.. అబద్ధాలని చెప్పడం ఆశ్చర్యాని కల్గిస్తోంది. మొత్తానికి చండీగఢ్ యూనివర్సిటీలో మాత్రం విద్యార్థినుల నిరసన మాత్రం చల్లారడం లేదు.

Tags

Next Story