గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్

రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్‌ పార్టీలో టాలీవుడ్ డైరెక్టర్‌ క్రిష్‌ ఉన్నట్టు తేల్చారు పోలీసులు. ఎఫ్ఐఆర్ లో 8వ నిందితుడిగి క్రిష్ పేరు చేర్చారు పోలీసులు. క్రిష్ స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో వివేదకానందతో క్రిష్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు కన్ఫామ్ చేయాల్సి ఉంది.

కాగా స్నేహితులు పిలిస్తేనే ఆ పార్టీకి వెళ్లానని.. డ్రైవర్ రాగానే అక్కడి నుంచి బయటకు వచ్చినట్లుగా క్రిష్ తెలిపాడు. ఇక డ్రగ్స్‌ కేసులో పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. వీరిలో వివేకానందను బీజేపీ నేత కుమారుడిగా గుర్తించారు పోలీసులు. నిందితులు కొకైన్ ని పేపర్ రోల్ లో చుట్టి సేవించినట్లు గుర్తించారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story