Crime News: పెళ్లై రెండు రోజులు.. అంతలోనే ఏమైందో.. గదిలో శవాలై..

Crime News: ఆ ఇంట బంధువుల సందడి ఇంకా అలాగే ఉంది. పెళ్లికి వేసిన పందిళ్లు ఇంకా తీయనే లేదు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నూతన వధూవరుల ముద్దు ముచ్చట్లను పొరుగింటి వారితో పంచుకోవాలనుకున్న కుటుంబ సభ్యుల కోరిక నెరవేరలేదు.. కొత్త జంట కత్తిపోట్లకు గురై గదిలో విగత జీవులుగా పడి ఉన్నారు.మంగళవారం సాయంత్రం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వారి వివాహ రిసెప్షన్‌కు కొద్దిసేపటి ముందు ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లయిన జంట మృతదేహాలు కనుగొనబడ్డాయి. తిక్రాపరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిజ్‌నగర్‌లో ఈ ఘటన జరిగిందని పోలీస్ ఆఫీసర్ అమిత్ బెరియా తెలిపారు.
మృతులను అస్లాం (24), కహ్కషా బానో (22)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరి వివాహం ఫిబ్రవరి 19న రాయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. రిసెప్షన్‌కు సిద్ధమవుతున్న సమయంలో వధూవరులిద్దరూ గదిలోకి వెళ్లారు. అంతలోనే వధువు కేకలు విన్న వరుడి తల్లి వారి గదికి వెళ్లి చూడగా తలుపు లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. లోపలి నుంచి మాటలు వినిపించకపోవడంతో బంధువులు గది తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. రక్తపు మడుగులో పడి ఉన్న జంటను చూసి భోరుమన్నారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవపరీక్షల కోసం పంపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత తదుపరి చర్య తీసుకుంటామని అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com