Cheddi Gang Chori : బీ అలర్ట్.. నగరంలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్

Cheddi Gang Chori : హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట్ కుంట్లూరు రోడ్‌లో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. ప్రజయ్ గుల్మోర్ గ్రేటెడ్ కమ్యూనిటీలో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు రెక్కీ నిర్వహించి మరీ చోరీ చేశారు.
విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం, 80 తులాల వెండి, 10వేల నగదు అపహరించారు. మరో మూడు ఇళ్లలో కూడా దొంగతనానికి యత్నించారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన విషయాన్ని బయటకు తెలియకుండా హయత్ నగర్ పోలీసులు ఉంచారు.
హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
నాలుగు ఇళ్లలో చోరీకి యత్నించిన చెడ్డీ గ్యాంగ్
ఓ ఇంట్లో 7.5 తులాల బంగారం, 80తులాల వెండి అపహరణ
మరో మూడు ఇళ్లలో చోరీకి యత్నించి విఫలం
సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com