Chennai: ఆర్థిక సమస్యలు.. భార్య, ఇద్దరు పిల్లలతో సహా వైద్యుడు ఆత్మహత్య

అప్పులు, వడ్డీ వ్యాపారుల వేధింపులే వైద్యుని కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
చెన్నైలోని అన్నా నగర్‌లోని ఓ ఇంట్లో ఈ ఉదయం ఒక వైద్యుడు, అతని భార్య, ఇద్దరు కుమారులు మొత్తం నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
సోనాలజిస్ట్ అయిన డాక్టర్ బాలమురుగన్, న్యాయవాది అయిన ఆయన భార్య సుమతి, వారి కుమారుల్లో ఒకరు నీట్ అభ్యర్థి జస్వంత్ కుమార్, మరొకరు 11వ తరగతి చదువుతున్న లింగేష్ కుమార్ రెండు గదుల్లో ఉరివేసుకుని మరణించారు.
నగరంలో అనేక అల్ట్రాసౌండ్ కేంద్రాలను నడిపిన డాక్టర్ బాలమురుగన్ భారీ అప్పుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం, డాక్టర్ డ్రైవర్ ఇంటికి చేరుకున్నప్పుడు, ఎవరూ స్పందించకపోవడంతో ఏదో జరిగి ఉంటుందని అనుమానంతో పోలీసులకు కంప్లైట్ ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు డాక్టర్ ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అక్కడ బాలమురుగన్ (52), అతని భార్య సుమతి (47) మరియు వారి కుమారులు మృతదేహాలు కనిపించాయి.
"వారు ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తూ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరి నుండి అధికారిక ఫిర్యాదు అందలేదు" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com