Chikoti Praveen : అక్కడ వాళ్లకు ఘనంగా బర్త్‌డే పార్టీ ఇచ్చిన చీకోటి ప్రవీణ్..

Chikoti Praveen : చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో డొంక కదులుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొందరు రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖ వ్యాపారవేత్తలు చీకోటి లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హరిత హోటల్‌లో చక్రపాణి అనే వ్యక్తి రూమ్స్ బుక్ చేసినట్లు సమాచారం. అతను టీఆర్‌ఎస్ నేత అశోక్ సోదరుడు. అటు.. బర్త్‌డే పార్టీకి మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్ కొడుకు రాము హాజరయ్యారు.
ఇక..జిల్లా నేతలతో కలిసి గోవా టూర్‌కి వెళ్లాడు ఏడుపాయల ఆలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్. ఆ సమయంలో చీకోటికి నేతలతో పరిచయం ఏర్పడింది. దీంతో బర్త్ డే పార్టీ ఏడుపాయలలో చేసుకుందామని చీకోటిని జిల్లా నేతలు, వ్యాపారులు కోరినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో 19న బర్త్ డే నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పార్టీ చేసుకున్నారు. 2 బ్యాంకెట్ హాల్స్, 6 గదులు బుక్ చేసుకున్నారు నేతలు. ఒక్కొక్కరి పేర్లు బయటికి వస్తుండటంతో జిల్లాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com