ఎందుకు గొడవ చేస్తున్నారు.. దేవుడే మా చేత చేయిస్తున్నాడు..

ఎందుకు గొడవ చేస్తున్నారు.. దేవుడే మా చేత చేయిస్తున్నాడు..
ఏ రోజు ఏం చేయాలో దేవుడు చెబుతాడు.. ఆయన ఆజ్ఞ ప్రకారమే మేము..

ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు. మేమేమీ కావాలని చేయలేదు.. దేవుడే మాచేత చేయిస్తున్నాడు.. ఆయన చెప్పిన ప్రకారమే నడుచుకుంటున్నాము. నా పెద్ద కుమార్తె శివుడైతే, చిన్న కుమార్తె పార్వతి.. నేను కాళికను.. పోలీసులు ఎన్ని సార్లు ప్రశ్నించినా ఇదే సమాధానం.. బిడ్డలను నిష్కారణంగా తమ చేతులతో తామే చంపేసుకున్నామన్న భావన కించిత్ కూడా లేదు. పైగా దానికి ప్రేరణ దేవుడే అంటూ సమర్థింపు.

మా పెద్ద కుమార్తె ప్రతి రోజూ దేవుడితో మాట్లాడుతోంది అని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఇద్దరు కుమార్తెల హత్య కేసులో నిందితురాలు పద్మజ చెబుతోంది. ఓ రోజు అక్క చెల్లెళ్లు అలేఖ్య, సాయి దివ్యలు కుక్కను తీసుకుని బయటకు వెళ్లినప్పుడు దారిలో ఎవరో దిష్టి తీసి ఉంచిన నిమ్మకాయలు, మిరపకాయలను తొక్కారు. ఆ రోజు నుంచి వారి మానసిక పరిస్థితి సరిగా లేదు. సాయి దివ్య తాను చనిపోతాననే భావనలో ఉండేది. అలేఖ్య కూడా అవును అని ఆమెకు సపోర్ట్ చేసేది.

ఈ నేపథ్యంలో ఈ నెల 23న తల్లిదండ్రులు కూతుళ్లిద్దరికీ ఓ మంత్రగాడిచేత తాయత్తు కట్టించారు. మరుసటి రోజు సాయిదివ్య తాను చనిపోతానని బిగ్గరగా ఏడుస్తుంటే.. తల్లిదండ్రులు వచ్చి వేపకొమ్మలతో కొట్టారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి మరింత బిగ్గరగా ఏడ్చింది. దాంతో పట్టిన దెయ్యం వదలాలంటే మరింత గట్టిగా కొట్టాలని భావించి పక్కనే ఉన్న డంబెల్‌తో తలపై కొట్టి నుదుటిపై కత్తితో పొడిచారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సాయిదివ్య ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటన జరిగిన తరువాత చెల్లిని బతికిస్తానంటూ అలేఖ్య తల్లిదండ్రులతో చెప్పి పూజగదిలోకి వెళ్లింది. అనంతరం అలేఖ్య చెప్పినట్లు తల్లిదండ్రులు చెశారు. ఆమె నోట్లో కలశం ఉంచి డంబెల్‌తో తలపై కొట్టారు. అదే రోజు సాయింత్రం 5 గంటల ప్రాంతంలో అలేఖ్య కూడా మరణించింది. ఈ రెండు హత్యల తరువాత తండ్రి పురుషోత్తమనాయుడు.. తోటి అధ్యాపకుడు గౌరీశంకర్‌కు ఫోన్ చేసి జరిగిన సంఘటన తెలిపారు.

ఆయన మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీడీగా ఉన్న రాజు సంఘటనా స్థలానికి వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story