క్రైమ్

పెళ్లి పత్రికలో పేర్లు వేయలేదని కత్తిపోట్లు..!

పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్‌లో చోటు చేసుకుంది.

పెళ్లి పత్రికలో పేర్లు వేయలేదని కత్తిపోట్లు..!
X

పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్‌లో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం చంద్రశేఖర్ నగర్‌కు చెందిన సురేష్ వివాహం జరిగింది. అయితే పెళ్లి పత్రికలలో తమ పేర్లు ఎందుకు పెట్టలేదని పెళ్లి రోజే సర్వేశ్.. బాలమణి కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. సురేష్ సోదరి బాలమణిని దూషించాడు. అయితే బంధువులందరు అందరూ సర్ది చెప్పడంతో అప్పటికి గొడవ ఆగింది.

అయితే ఆదివారం ఉదయం బాలమణి తన కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బందువులను తీసుకొని సర్వేశ్ ఇంటికి వెళ్ళింది. సర్వేశ్ సోదరుడు శేఖర్ వచ్చిన వారిపైకి రెచ్చిపోయాడు. ఆవేశంతో ఇంట్లోకి వచ్చిన సర్వేశ్‌ కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. సర్వేశ్ చేతిలోని కత్తి తీసుకొని శేఖర్ కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ప్రవీణ్, నోముల పరశురాము, యాదగిరి, ప్రతాప్ కుమార్ తీవ్రగాయాల పాలయ్యారు.

బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉనట్లు తెలుస్తోంది. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story

RELATED STORIES