Crime News: ఘోరం.. 10వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..

Crime News: రోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఘోరం జరుగుతూనే ఉంది. వయసు తారతమ్యం లేకుండా అత్యాచారాలకు బలవుతున్నారు. ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లింది. మరో ముగ్గురు స్నేహితులు మధ్యలో కలిసి ఆమెను హోటల్‌కి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు.
హరియాణాలోని గురుగ్రామ్‌లో పదవతరగతి చదువుతున్న బాలికపై అయిదుగురు యువకులు అత్యాచారం చేశారు. బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో తన కూతురు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కూతురు దగ్గర్లోని పార్క్‌లో వాకింగ్‌కి వెళ్లి ఉంటుందని భావించింది తల్లి.
రాత్రయినా కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ఆమె జాడ తెలియలేదు. ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటికి సమీపంలో కుమార్తె అత్యంత దీనావస్థలో కనిపించింది" అని బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
రాత్రంతా ఎక్కడున్నావని అడగ్గా, తన ఇద్దరు స్నేహితులు బైక్‌పై హోటల్‌కు తీసుకెళ్లారని, మరో ముగ్గురు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఏడుస్తూ తల్లికి వివరించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని తెలిపింది.
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించగా, అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com