Adilabad: ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు.. సూసైడ్ నోట్ రాసి బాలిక ఆత్మహత్య..

Adilabad: ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు.. సూసైడ్ నోట్ రాసి బాలిక ఆత్మహత్య..
X
Adilabad: ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు తట్టుకోలేక పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకుంది.

Adilabad: ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు తట్టుకోలేక పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకుంది. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్‌లో ముస్లే సాక్షి అనే బాలిక పురుగుల మందు తాగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు మీద నకిలీ ఐడీలు తయారు చేసి.. అసభ్యకరమైన సందేశాలు పంపిస్తుండడంతో.. రెండు రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది సాక్షి. ఐ వాంట్ జస్టిస్ అంటూ ఓ పేపర్‌ మీద రాసి, తన పేరు మీద నకిలీ ఐడి తయారు చేసిన వారిని గుర్తించి శిక్షించాలని సూసైడ్ నోట్ రాసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Tags

Next Story