కలెక్టర్‌ గన్‌మెన్‌ ఘాతుకం.. భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి తానూ కాల్చుకుని

కలెక్టర్‌ గన్‌మెన్‌ ఘాతుకం.. భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి తానూ కాల్చుకుని
నరేష్ (35), అతని భార్య చైతన్య (30), కుమార్తె రిషిత (5), కుమారుడు రేవంత్ (6) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాథమిక విచారణలో నరేష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

నరేష్ (35), అతని భార్య చైతన్య (30), కుమార్తె రిషిత (5), కుమారుడు రేవంత్ (6) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాథమిక విచారణలో నరేష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్‌గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేష్ తన సర్వీస్ రివాల్వర్‌తో తన భార్యను, ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

ఈ సంఘటన ఆయన స్వగ్రామమైన సిద్దిపేటలోని చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. నరేష్ 2013 బ్యాచ్ కానిస్టేబుల్. నరేష్‌ విధులకు హాజరుకాకపోవడం, ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడంతో డిపార్ట్ మెంట్ కు చెందిన సిబ్బంది నరేష్ ఇంటికి వెళ్లి చూడగా కుటుంబం అంతా విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story