బాసర ట్రిపుల్‌ఐటీలో వరుస ఆత్మహత్యలు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దీపిక ఆత్మహత్య ఘటన మరవకముందే మరో విషాదం చోటుచేసుకుంది. బూర లిఖిత అనే విద్యార్ధిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన లిఖిత పియూసీ ఫప్ట్ ఇయర్ చదవుతోంది. అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు గంగా హాస్టల్ లో ఉంటున్న ఆమె 4వ అంతస్తు పై నుంచి జారి పడి చనిపోయినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు.లిఖిత కిందపడిన విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఆమెను క్యాంపస్ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం బైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే లిఖిత మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.అయితే ఆమె మృతికి ట్రిపుల్‌ఐటీ అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అర్థరాత్రి కుక్కలు తరమడంతో నాలుగో అంతుస్తునుంచి ఆమె పడిపోయిందంటూ హాస్టల్ వార్డెన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదవశాత్తూ కిందపడిందా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com