పెళ్లికి అతిథుల్లా వచ్చి చోరీ.. దంపతులకు దేహశుద్ధి

పెళ్లికి అతిథుల్లా వచ్చి చోరీ.. దంపతులకు దేహశుద్ధి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో జరుగుతున్న వివాహ వేడుకకు అతిథుల్లా వచ్చి చోరీలకు పాల్పడుతున్న దంపతులకు దేహ శుద్ధి చేశారు. నవదంపతులతో పాటు.. వారి బంధువులకు చెందిన బంగారం చోరీ చేసి.. గుట్టుచప్పుడు కాకుండా పారిపోవాలని స్కెచ్‌ వేశారు. అయితే ఒకరి దగ్గర బంగారం చోరీ చేస్తూ పట్టుబడ్డారు.. దీంతో ఆ దంపతులను బంధించి వెతకగా వారి దగ్గర మూడు తులాల బంగారం దొరికింది. వెంటనే దేహ శుధ్ది చేసి.. పోలీసులకు అప్పగించారు స్థానికులు.. తప్పైపోయింది క్షమించండి అని వేడుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ దపంతులను ఇందిరానగర్‌ కాలనీకి చెందిన పరమేశ్‌, యశోదలుగా గుర్తించారు.. కేసు నమోదు చేసి.. గతంలో కూడా ఏమైనా చోరీలకు పాలప్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story