రూ.20 నోటు ఇచ్చి రూ.50 లక్షలు కొట్టేసిన కొరియర్‌ బాయ్స్‌

రూ.20 నోటు ఇచ్చి రూ.50 లక్షలు కొట్టేసిన కొరియర్‌ బాయ్స్‌
రూ.20 నోటు ఇచ్చి యాబై లక్షలు కొట్టేసిన ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్న వ్యాపారికి కుచ్చుటోపి పెట్టారు కొరియర్‌ బాయ్స్‌

రూ.20 నోటు ఇచ్చి యాబై లక్షలు కొట్టేసిన ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్న వ్యాపారికి కుచ్చుటోపి పెట్టారు కొరియర్‌ బాయ్స్‌. వివరాల్లోకి వెళితే.. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శైలేందర్ సింగ్ అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. అయితే అంగాడియ కొరియర్‌కు చెందిన వ్యక్తి ద్వారా తనకు 50 లక్షలు పంపించాలని అమన్‌ ప్రీత్‌ సింగ్‌ అనే వ్యక్తి శైలేందర్‌ను ఫోన్‌లో అడిగాడు. అందకు గాను శర్మ అనే వ్యక్తి నీ దగ్గరకు 96 ఎం 279764 నెంబర్ తో ఉన్న 20 రూపాయల నోటు తీసుకొస్తాడని అతడికి రూ.50 లక్షలు ఇవ్వమని అమన్‌ప్రీత్‌ తెలిపాడు.

అనంతరం శర్మ అనే వ్యక్తి శైలేందర్‌ సింగ్‌కు ఫోన్‌ చేసి తాను బిజీగా ఉన్నానని తనక బదులు సంతోష్ అనే వ్యక్తి ఆ రూ.20 నోటు తీసుకొస్తాడని చెప్పాడు. ఈ క్రమంలో శైలేందర్‌ సంతోష్‌ అనే వ్యక్తి నుంచి రూ.20 నోటు తీసుకొని రూ.50 లక్షలు ఇచ్చాడు. అమన్ ప్రీత్ సింగ్‌కు డబ్బుందకపోవడంతో అనుమానం వచ్చి శర్మ, సంతోష్‌లకు కాల్‌ చేయగా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వచ్చాయి. దీంతో మోసపోయామని గ్రహించి శైలేందర్‌ సింగ్‌, అమన్‌ ప్రీత్‌ సింగ్‌లు పోలీసులను ఆశ్రయించారు. శైలేందర్ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారా హిల్స్‌ పోలీసులు 420,406 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి హవాలా డబ్బుగా అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story