Crime: కలవరపెడుతున్న మిస్సింగ్ కేస్ లు...!

hyderabad
Crime: కలవరపెడుతున్న మిస్సింగ్ కేస్ లు...!
నగరంలో పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు; కలవరపెడుతున్న లెక్కలు; ఆచూకీ దొరకని కేసులే అధికం...

సిటిలో మిస్సింగ్ కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని కేసులు మిస్టరీగా మారితే...మరికోన్ని విషాదాంతం అవుతున్నాయి. చిన్న కారణాలతో ఇంట్లో నుంచి వేళ్లిపోతున్నావారు కొందరైతే ఏళ్లు గడిచినా ఆచూకీ దొరకని వారు కోకొల్లలు. దీంతో మిస్సింగ్ కేసులు అటు కుటుంబ సభ్యులను, ఇటు పోలీసులను కలవరపెడుతున్నాయి. వీటిని ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. మరో వైపు పోలిసులు నిర్లక్ష్యం వల్ల చాలా మంది అచూకీ దోరకడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

తప్పిపోయిన వారిలో కొంతమంది ఆచూకీ మాత్రమే లభ్యమవుతుండగా మరికొంత మంది ఏమైపోతున్నారో ఎవరికి అంతుబట్టడంలేదు. అదృశ్యమైన 18 ఏళ్లలోపు బాలబాలికలు అక్రమ రవాణాకు గురవుతున్నారు. అధిక శాతం మహిళా మిస్సింగ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రేమ వ్యవహారం, అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని చిన్న పిల్లలు తెలిసి తెలియని వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో గృహ హింస, కుటుంబ సభ్యుల వేధింపులు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు మరికొందరు ఇంటిని వీడుతున్నారని తెలుస్తోంది.

ఇక ఈ మధ్యకాలంలో చిన్నారుల వరుస మిస్సింగ్‌ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దమ్మాయిగూడలో కనిపించకుండా పోయిన చిన్నారి ఇందు మరుసటి రోజు చెరువులో విగతజీవిగా కనిపించింది. ఆ తర్వాత వరుసగా పాతబస్తీ లో నసీర్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. ఆతర్వాత కవాడిగూడకు చెందిన 13 ఏళ్ల బాలిక అదృశ్యమయ్యింది. వీరిద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.


2022లో రాచకొండ కమిషరేట్ పరిధిలో 3వేల 338 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. సైబరాబాద్ పరిధిలో 3వేల 798 మిస్సింగ్ కేసులు నమోదవగా, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3వేల మంది వరకు మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. అంటే ఒకే ఏడాదిలో 10వేల మందికి పైగా మిస్ అవగా సిటిలో సగటున రోజుకు 30మంది మిస్ అవుతున్నట్లు లెక్కలు చెప్పుతున్నాయి.


ఇందులో 16 నుంచి 35 ఏళ్ల మధ్య వారే అధికంగా ఉండగా వీటిల్లోనూ బాలికలు, యువతుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో మిస్సింగ్ కేసులను ఛేదించడం పోలీసులకు సవాలుగా మారుతోంది. కొన్ని కేసులను టెక్నాలజీ ఆధారంగా సులభంగా చేధించేస్తున్నారు. మహిళలు మిస్సింగ్ కేసులో అధిక శాతం ప్రేమ వ్యవహారం అని ప్రాథమిక నిర్ధారణలో తేలుతున్నాయి. మిస్సింగ్ కి సంబందించి వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం ఆపై వారి గురించి దర్యాప్తు కొనసాగిస్తే 75 శాతం మంది ప్రేమ పేరుతో వెళ్లిపోతున్నట్లు విచారణలో తేలుతున్నాయి.

అయితే యువతులు, చిన్నారుల మిస్సింగ్‌ కేసులు ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. కుటుంబ సభ్యుల వద్ద సేకరించిన సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపడుతున్నారు.అయితే కోన్ని రోజులకు మిస్సింగ్ కేసులు మూలకు పడుతున్నాయి.పెండింగ్ మిస్సింగ్ కేసులు పేరుకుపోవడంతో నిందితులను ట్రేస్ చేయడంలో పోలిసులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కోన్ని కేసుల్లో అదృశ్యమైన వారు తిరిగి ఇంటికి చేరినా సమాచారం పోలిసులకు చేరడం లేదు. దీంతో మిస్సింగ్ కేసు అలాగే ఉండిపోతోంది.


మిస్సింగ్ కేసుల్లో కోంతభాగం వరకు మహిళలే అధికంగా ఉండడం, వారిని హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురిఅవుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో అధిక శాతం మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఎన్నో మిస్సింగ్ కేసులు మిస్టరీగా మారుతున్నాయి. ఇలాంటి కేసులను సీఐడీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు పోలిసులు.

Tags

Next Story