Crime: కన్న తండ్రిని పొడిచిన బాలిక

Crime: కన్న తండ్రిని పొడిచిన బాలిక
ప్రియుడి మాట విని తండ్రిపై హత్యాయత్నం

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ల ప్రేమ వ్యవహారం ఓ తండ్రి ప్రాణాల మీదకు వచ్చింది. ప్రియుడు చెప్పిన మాయమాటలు విని మైనర్‌ బాలిక తన కన్నతండ్రిని కిరాతకంగా కత్తితో పొడిచి హత్యాయత్నం చేసింది. అతడు చెప్పడంతోనే ఈ దారుణానికి ఒడికట్టానని తెలిపింది.


ఇదిలా ఉండగా బాలిక వద్ద నుంచి డబ్బు, బంగారం తీసుకొని ఆమెనూ నిందితుడు మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందే ఏడుగురితో అతడు ప్రేమ వ్యవహారం నడిపి మోసం చేసినట్లు వెల్లడైంది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు ప్రారంభించారు.


Tags

Read MoreRead Less
Next Story