Crime : నిక్కీ యాదవ్ ను చంపడానికి సాహిల్ ఫ్యామిలీ సహాయం

Crime : నిక్కీ యాదవ్ ను చంపడానికి సాహిల్ ఫ్యామిలీ సహాయం
సహజీవనం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు.. మరో పెళ్లి చేసుకోవడానికి చంపేశాడు

నిక్కీ యాదవ్, సాహిల్ గెహ్లట్ కేసులో ఆసక్తికరమైన విషయాలు వెళ్లడవుతున్నాయి. నిక్కీ యదవ్, సాహిల్ సహజీవనం చేయడం లేదని వారికి వివాహం జరిగినట్లు పోలీసులు చెప్పారు. సాహిల్, నిక్కీ ఉంటున్న ఇంటిని పోలీసులు తనికీ చేయగా వారి మ్యారెజ్ సర్టిఫికెట్ దొరినట్లు తెలిపారు. ఇద్దరికీ 2020లో గ్రేటర్ నోయిడాలోని ఆర్యసమాజ్ లో పెళ్లి జరిగినట్లు చెప్పారు. నిక్కీ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు పెళ్లి విషయం తెలువదని అన్నారు. సాహిల్ ను రిమాండ్ లోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో, అతని ఇంటిని తనికీ చేశారు పోలీసులు. అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ ను కనుగొన్నారు.

నిక్కీతో పెళ్లి జరిగినా కూడా, సాహిల్ తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. వివాహం జరుగుతున్న విషయం తెలుసుకున్న నిక్కీ యాదవ్... సాహిల్ ను నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో... సాహిల్ తన మొబైల్ కేబుల్ తో నిక్కీ మెడకు ఉరి వేసి చంపాడు. నిక్కీని చంపడానికి సాహిల్ కు అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు సహాయం చేసినట్లు తెలిపారు పోలీసులు. విరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story