Crime : నెల్లూరులో యువకుడి దారుణ హత్య.. తల్వార్లతో దాడి

Crime : నెల్లూరులో యువకుడి దారుణ హత్య.. తల్వార్లతో దాడి
X

నెల్లూరులో యువకుడి దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది. రెండో నగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉడ్‌ హౌజ్‌ సంఘంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహేష్‌ అనే యువకుడు స్నేహితులతో క్యారమ్స్ ఆడుతుండగా.. ముఖాలకు ముసుగులు ధరించి.. ఒక్కసారిగా వచ్చిన దుండగులు కత్తులు, తల్వార్లతో దాడికి తెగబడ్డారు. మహేష్‌ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అటు.. హత్య చేసిన తర్వాత దుండగులు పారిపోతున్న విజువల్స్‌ సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్‌ ద్వారా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Next Story